రైతులు సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు ఈ మేరకు జీవీఎంసీ 50వ వార్డు పరిధి మస్జీద్ స్టీట్ వద్ద బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడు జాతీయ ఎగ్జిక్యూటివ్ మెంబర్ వంశీ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన ఆత్మీయ కలయిక కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఎంతోమంది మేధావులు ఉన్న భారతదేశం లో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ అనే నినాదంతో భారతదేశాన్ని గొప్ప దేశంగా నిర్మించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని అన్నారు. ముఖ్యంగా విద్యతోనే సమాజంలో ఒక మంచి గుర్తింపు లభిస్తుందని విద్య లేని జీవితం శూన్యమన్నారు. ప్రతి ఒక్కరు విద్యావంతుడుగా ఎదిగి అని రంగాల్లో రాణించాలని అన్నారు. అదేవిధంగా మహిళలకు ప్రాధాన్యత కల్పించి వారిని అన్ని రంగాల్లో ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహ, ఎమ్మెల్సీ మాధవ్, బిజెపి జిల్లా అధ్యక్షుడు రవీంద్ర బిజెపి నాయకుడు అప్పలకొండ తదితరులు పాల్గొన్నారు.