జాతిపిత మహాత్మాగాంధీ 75 వ వర్ధంతి సందర్భంగా మైదుకూరు అమ్మవారిశాలలో సోమవారం ఆర్యవైశ్య సభ ఆధ్వర్యంలో అధ్యక్షులు సూరిశెట్టి శివ వెంకట ప్రసాద్ గుప్తా గాంధీజి చిత్ర పటానికి పుల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సూరిశెట్టి ప్రసాద్ మాట్లాడుతూ. స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ చేసిన కృషిని కొనియాడారు. మైదుకూరు లో మహాత్మాగాంధీ, పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాలు త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యలవలి హరికిషన్, దొంతు వెంకట సుబ్బయ్య, దరిసావరహాలుగారి సునీల్, మిట్టా సురేష్, పెండెకంటి సంజీవ్, ఎలిశెట్టి ప్రసాద్, కార్యవర్గ సభ్యులు వెంకటేశ్వర్లు, మారుతి, హరనాథ్, సురేంద్ర, ఆనంద్, శివ తదితరులు పాల్గొన్నారు.