ఏఐఎస్ఎఫ్ కడప జిల్లా 18వ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ బద్వేలు పట్టణంలోని బి జె ఎస్ ఆర్ కళాశాలతో సోమవారం కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ బద్వేల్ ఏరియా కార్యదర్శి కామ్రేడ్ యం. అశోక్ మాట్లాడుతూ విద్యార్థి పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కుల్ని దేశంలో ప్రజాస్వామ్యం మాటన నియంతృత్వ పోకడలతో ఆటంకం కలిగే విధంగా పాలకుల పాలసీలు తయారవుతున్నాయన్నరు. విద్యారంగాన్ని సమూల మార్పులు తీసుకొస్తూ, రాజకీయ రంగును రుద్దుకుంటూ, విద్యారంగంలో కూడా మతోన్మాదాన్ని ప్రేరోపితం చేసే విధంగా ఉన్న నూతన జాతీయ విద్యా విధానాన్ని బలవంతంగా విద్యార్థులపై రుద్దే ప్రయత్నం జీవో 117 చేస్తుందని అలాంటి జీవో ను వెంటనే రద్దు చేయాలన్నారు. విద్యారంగ సమస్యలు ఎత్తిచూపుతూ భవిష్యత్తు పోరాటాలకు పొద్దుటూరులో జరగబోతున్న 18వ కడప జిల్లా మహాసభలు వేదిక కాబోతున్నయన్నారు. పెద్ద ఎత్తున తిరుగుబాటు జెండా ఆలిండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కార్యచరణ రూపొందుతున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ పట్టణ నాయకులు వర్ధన్, సంతోష్, పెద్దఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు.