బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి మూడు రూపాయలు వడ్డీ చెల్లిస్తున్నప్పటికీ మార్వాడి షేట్ ల వేధింపులు అధికమయ్యాయని అలాంటి వారి లైసెన్సులను రద్దు చేయాలని రాయలసీమ మహిళా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తస్లిం, లక్ష్మీదేవి అన్నారు. కడప ఆర్. సి. పి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుటుంబ అవసరాల రిత్య అత్యవసర పరిస్థితులలో బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టుకొని ఇచ్చిన డబ్బుల వడ్డీ వస్సూళ్లతో అత్యంత అవమానకరంగా మాట్లాడుతూ వేధిస్తున్నారని అని అన్నారు.
వడ్డీల వసూళ్ల కోసం వేల కాని వేళల్లో ఇండ్లకు వచ్చి వీధిలోని అందరి ముందు అవమానకరంగా మాట్లాడుతున్నారని వారు వివరించారు. నాడు బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టే సమయంలోనే మార్కెట్ విలువతో పోల్చి సగం డబ్బులు మటుకే ఇస్తున్నారని, ఇచ్చిన రోజు నుంచి వడ్డీల వేధింపులు అధికమయ్యాయని అలాంటి వారిని వెంటనే వారి లైసెన్సులు రద్దు చేసి వేధింపులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారి డిమాండ్ చేశారు.