జాతిపిత మహాత్మాగాంధీకి స్థానిక ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా సోమవారం వేంపల్లెలోని ఆ పార్టీ కార్యాలయంలో చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కో ఆర్డినేటర్ రహంతుల్లా మాట్లాడుతూ మహాత్మాగాంధీ స్వతంత్ర భారత దేశం కోసం పోరాటంలో బ్రీటీష్ వలస పాలనకు వ్యతిరేకంగా అహింస మరియు సత్యగ్రహ సూత్రాలను ఆచరించి ప్రపంచానికి కొత్త పోరాటాన్ని చూపించారు. గాంధీ సిద్ధాంతాలకు కట్టుబడిన అనేక దేశాలు బానిసత్వం నుంచి విముక్తి పొందాయన్నారు. గాంధీజీ జీవితం దేశంలోని ప్రతి తరానికి స్ఫూర్తినిస్తాయని తెలిపారు. అహింస, సత్యగ్రహం అనే ఆయుధాలతో స్వాతంత్య్ర సంగ్రామాన్ని ముందుకు నడిపించిన జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆ మహానియునికి స్మృతికి ఘన నివాళులన్నారు. ఈ కార్యక్రమంలో ఆప్ కార్యకర్తలు, సభ్యులు పాల్గొన్నారు.