ఖాజీపేట మండలం పేరారెడ్డి కొట్టాలులో నివాసం ఉంటున్న తంగెల్ల నీలమ్మ అను ఒంటరి నిరుపేద మహిళల గత రెండు సంవత్సరాల నుండి మధుమేహ వ్యాధితో బాధ పడుతూ ఉండేది. గత ఏడాది ఒక కాలు కూడా తొలగించడం జరిగింది. దీనితో కుటుంబ పోషణ కష్ట తరమైన నేపథ్యంలో ఈ విషయాన్ని తెలుసుకున్న శ్రీ గాయత్రి సేవా ట్రస్ట్ వారు సోమవారం బాధితురాలికి 3ప్యాకెట్స్ బియ్యన్ని, 3 నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు ను అందించడం జరిగింది. ఈ కార్యక్రమం లో ట్రస్ట్ ఛైర్మెన్ డా. నిగినే వెంకటేశ్వర్లు, ట్రస్ట్ కార్యదర్శి మధు, ఉప కార్యదర్శి శివనంద రెడ్డి లు పాల్గొన్నారు.