జాతిపిత మహాత్మా గాంధీ 75 వ వర్ధంతి సందర్బంగా పులివెందుల వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గోటూరు చిన్నప్ప, డిప్యూటీ డైరెక్టర్ లావణ్య ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా చిన్నప్ప, లావణ్య మాట్లాడుతూ అహింస, సత్యం అనే ఆయుధాలతో బ్రిటీష్ వారిని గండగడలాడించి భారత స్వాతంత్ర ఉద్యమం లో తనదైన ముద్ర వేశారు. మహాత్మా, జాతిపిత అనే బిరుదు లతో భారతీయుల హృదయలలో చిరస్మరణీయులు గా నిలిచిపోయారన్నారు. ప్రపంచానికి శాంతి మంత్రం బోధించి పలు దేశాలు స్వాతంత్య్రం సంపాదించుటకు గాంధేయ మార్గం శరణ్యం అని నిరూపించారు. భారత దేశ పౌరులు గా గాంధేయ సిద్ధాంతాలు అనుసరించి ప్రతి ఒక్కరు ఆయన జీవించిన మార్గంలో నడిచి, ఆయన సిద్ధాంతాలకై కృషి చేయాలని పిలుపునిచ్చారు. తర్వాత చినీ రైతులతో, వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించి రైతుల కోసం చీని మండిలు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు, వై. ఎస్. ఆర్ జిల్లా పార్లమెంటు సభ్యులు అవినాష్ రెడ్డి గారి సలహాలతో, ఓ ఎస్ డి అనిల్ కుమార్ రెడ్డిగారి సూచనలతో త్వరలోనే పులివెందుల మార్కెట్ యార్డులో చీని కాయలు కొనుగోలు చేసే కార్యక్రమం మొదలవుతుందని తెలియజేశారు, రైతులు, వ్యాపారస్తులు సహకరించాలని కోరారు, ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.