రాష్ట్ర వ్యవసాయ శాఖ కమీషనర్ మరియు డైరెక్టర్ ఆదేశాల మేరకు వేంపల్లె పట్టణంలో సోమవారం మండల వ్యవసాయాధికారి రాజేంద్రప్రసాద్ ఎరువుల దుకాణాల్లో మరియు గోడౌన్లలో తనిఖీ నిర్వహించారు. వేంపల్లి లో ఆయన మాట్లాడుతూ యూరియా మరియు ఎరువులు నిల్వపై తనిఖీ చేశామన్నారు. ఎరువులకు సంబంధించిన అమ్మకం, కొనుగోలు బిల్లులు, డైలీ స్టాక్ బోర్డు తదితర రికార్డులను పరిశీలించారు. ప్రస్తుతం వేంపల్లి మండలంలో ఆర్బీకేల్లో మరియు ప్రైవేట్ ఔట్లెట్స్ నందు సుమారుగా 175 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. ఎరువులు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మాత్రమే రైతుకు అందించాలని సూచించారు. అధిక ధరలు అమ్మిన్నట్లు రైతులు ఎవరైనా పిర్యాదు చేస్తే వారి ఎరువుల లైసెన్స్ రద్దు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనల ప్రకారం ప్రతి దుకాణదారుడు రికార్డులను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.