పల్నాడు జిల్లా, వినుకొండలో సీఎం జగన్ పర్యటించారు. జగనన్న చేదోడు పథకం మూడో విడత సాయాన్ని అర్హులకు అందజేశారు. దర్జీలు, రజకులు, నాయీబ్రాహ్మణులకు రూ.10వేల సాయం అందించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10 వేల నగదు జమ చేసినట్టు వెల్లడించారు. ఏపీ వ్యాప్తంగా 3.30 లక్షల మందికి రూ.330.15 కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. మూడేళ్లలో జగనన్న చేదోడు కింద రూ.927.51 కోట్లు అందించామన్నారు. దేశానికే దిక్సూచిగా ఏపీ నిలుస్తోందని సీఎం జగన్ అన్నారు.