విశాఖపట్నం జిల్లా, పాయకరావుపేట జాతీయ రహదారిపై మండలంలోని నామవరం జంక్షన్ వద్ద సోమవారం రాత్రి ట్యాంకర్ లారీ బీభత్సం సృష్టించింది. తుని నుంచి విశాఖ వైపు వెళుతున్న ఈ వాహనం.. రోడ్డు పక్కన నిల్చుని మాట్లాడుకుంటున్న వారిపైకి దూసుకెళ్లింది. దీంతో నామవరం గ్రామానికి చెందిన బొట్టా కృష్ణ(40), పక్కుర్తి చంటి(60) అక్కడికక్కడే మృతిచెందారు. గొర్ల లక్ష్మీనారాయణ, పక్కుర్తి శ్రీను, కొర్ర శ్రీను తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108 అంబులెన్స్‌లో తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదుచేసినట్టు ఎస్ఐ బి.జోగారావు తెలిపారు. మృతుల్లో బొట్టా కృష్ణకు భార్య, ఇద్దరు పిల్లలు వున్నారు. ఇతను హైదరాబాద్‌లో సినీ రంగంలో పనిచేస్తున్నాడు. సంక్రాంతి పండుగకు ఇంటికి వచ్చాడు. ఒకట్రెండు రోజుల్లో తిరిగి హైదరాబాద్ వెళ్లాల్సి వుందని కుటుంబ సభ్యులు తెలిపారు. మరో మృతుడు పక్కుర్తి చంటికి భార్య, వివాహితులైన ముగ్గురు కుమార్తెలు వున్నారు.