మోసపూరిత హామీలతో ప్రజలను నమ్మించి నట్టేముంచిన సీఎం జగన ఎన్నికల వేళ మరోసారి మభ్యపెట్టేందుకు కుట్ర పన్నుతున్నారని ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకేహరి మండిపడ్డారు. సోమవారం ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో అనంతపురం అంబేడ్కర్ విగ్రహం వద్ద వైసీపీ ప్రభుత్వం సబ్ప్లాన అమలు తీరుపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సాకేహరి మాట్లాడుతూ.... ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి కల్పన, ఆర్థిక స్వావలంబన కోసం ఏర్పాటు చేసిన ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన నిధులను వైసీపీ ప్రభుత్వ దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు. కార్యక్రమంలో నాయకులు రామాంజినేయులు, రామకృష్ణ, కాటమయ్య, ప్రతాప్, గణేష్ నాయక్, మలోబులు, చెన్నకేశవులు, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.