విశాఖపట్నం: పాయకరావుపేట మండలం నామవరం గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. సోమవారం రాత్రి 9 గంటలకు రోడ్డు పక్కన నిలుచొని మాట్లాడుకుంటున్న వారిపై ట్యాంకర్ లారీ దూసుకుపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో నామవరం గ్రామానికి చెందిన బొట్టా కృష్ణ, పక్కుర్తి చంటి మృతిచెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. పది నిమిషాల్లో ఇంటికి వెళ్లి నిద్రపోదామనుకున్నవారిని ట్యాంకర్ లారీ మృత్యువై కబళించింది. దీంతో నామవరం శోక సంద్రమైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa