కొరిసపాడు మండలం రావినూతల గ్రామంలో సుమారు పది సంవత్సరాలు పైబడిన బాలుడు మంగళవారం ప్రధాన వీధుల్లో ట్రాక్టర్ నడపటం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తల్లిదండ్రులు ఆ బాలుడికి ట్రాక్టర్ అప్పగించి వీధుల్లోకి పంపించడం పట్ల స్థానిక ప్రజలు విమర్శిస్తున్నారు. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే పరిస్థితి ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లల ప్రాణాలు పట్ల చెలగాటమాడుతున్నారని పలువురు ప్రజలు మండిపడ్డారు. ఈ సంఘటనపై తల్లిదండ్రులు కనీసం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి.