కందుకూరు డిప్యూటీ డిఇఓ గా బాధ్యతలు నిర్వహిస్తున్న పి వెంకటేశ్వర్లు గుండె పోటుతో మృతి చెందారు. కొండేపి లో గల ఆయన నివాసంలో సోమవారం రాత్రి 11 గంటల సమయంలో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించేలోపే ఆయన మరణించారు. డిప్యూటీ డిఇఓ వెంకటేశ్వర్లు మృతి పట్ల కందుకూరు నియోజకవర్గంలోని పలు పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, పలువురు సంతాపం తెలిపారు. ఆయన మృతి తీరనిలోటని పేర్కొన్నారు.