చీరాల పట్టణంలో నేరస్తావరంగా పేరొందిన రాంనగర్ పరిసర ప్రాంతాలలో జిల్లా ఎస్పీ జిందాలాదేశాల మేరకు మంగళవారం ఉదయాన్నే టూ టౌన్ సిఐజి సోమశేఖర ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ జరిగింది. డిఎస్పీ శ్రీకాంత్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్డన్ సెర్చ్ లో భాగంగా ఆ ఏరియాను పోలీసులు జల్లెడ పట్టారు. ఈ సందర్భంగా నాలుగు లీటర్ల నాటు సారా, సారా తయారీకి ఉపయోగించే 300 లీటర్ల ముడి సామాగ్రిని పోలీసులు సీజ్ చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, పాత నేరస్తులు ఎవరైనా ఉన్నారా అని పోలీసులు ఇల్లిల్లు గాలించారు. కాగా అసాంఘిక శక్తులకు ఆశ్రయమిచ్చినా, నేరస్తులకు తోడ్పాటు అందించినా కఠినంగా శిక్షిస్తామని సి. ఐ సోమశేఖర్ హెచ్చరించారు. చీరాల వన్ టౌన్ సిఐ మల్లికార్జునరావు, రూరల్ సిఐ మల్లికార్జున, ఐదుగురు ఎస్సైలు, 70 మంది పోలీస్ సిబ్బంది కార్డన్ సెర్చ్ లో పాల్గొన్నారు.