కృష్ణా జిల్లా మచిలీపట్నంలో బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో డిఇఓ తాహెరా సుల్తానా ప్రెస్మీట్ నిర్వహించారు. ఏపీ సార్వత్రిక విద్యా పీఠం ఓపెన్ స్కూల్ ద్వారా పదవ తరగతి, ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లింపుకు మార్గదర్శకాలు విడుదలైనట్టు విద్యాశాఖాధికారిణి తాహేరా సుల్తాన లోకల్ న్యూస్ కి తెలిపారు.
అపరాధ రుసుము లేకుండా ఫిబ్రవరి 15వ తేదీ లోపు ఆన్లైన్ విధానంలో ఫీజు చెల్లించ వచ్చన్నారు. గత ఏడాది ఓపెన్ స్కూల్ ద్వారా పదవ తరగతి, ఇంటర్ పరీక్షలకు హాజరై ఫెయిల్ అయిన వారు, గత ఏడాది ఫైనల్ పరీక్షలకు హాజరు కాని వారు సైతం ఈ ఏడాది ఫీజు చెల్లించి పరీక్షకు హాజరు కావొచ్చని డీఈవో తెలిపారు.