సారవకోట మండలంలోని చీడిపూడి గ్రామంలో వెలసి ఉన్న వేంకటేశ్వరస్వామి వార్షిక కళ్యాణ మహోత్సవ యాత్రాత్సోవాలకు దేవేరులతో కలసి సిద్ధమయ్యారు. ఈ గ్రామానికి చెందిన గేదెల సింహాద్రి నాయుడు 1932లో ఆలయాన్ని నిర్మించి ప్రతిష్టించారు. అప్పటినుండి గేదెల వంశీయులు ప్రతి ఏడాది క్రమం తప్పకుండా కళ్యాణ యాత్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. భీష్మ ఏకాదశి సందర్భంగా బుధవారం నుండి అయిదు రోజుల పాటు ఈ మహోత్సవాలను గ్రామస్తులు భక్తుల సహకారంతో ప్రస్తుత అనువంశిక ధర్మకర్త గేదెల బాలకృష్ణ నేతృత్వంలో నిర్వహించనున్నారు. నిత్య పూజలు కళ్యాణంతో పాటు చివరి రోజు జరుగనున్న స్వామివారి చక్ర తీర్ధ స్నానాలు తిలకించి స్వామివారి ఉత్సవ విగ్రహాలతో పుణ్య స్నానాలు చేయడానికి పలు గ్రామాలనుండి వేలాది మంది భక్తులు తరలి వచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం ఆనవాయితీగా వస్తోంది.