శీతాకాలం రాగానే చాలా మంది సాధారణ నీటిని తాగడానికి ఇబ్బంది పడుతుంటారు. కొందరు ప్రత్యామ్నాయంగా గోరువెచ్చని, వేడి నీటిని తాగుతుంటారు. అయితే ఎక్కువ మోతాదులో వేడి, గోరువెచ్చని నీటిని తాగడం వల్ల ప్రయోజనాలతో పాటు ఇబ్బందులు కూడా ఉన్నాయి. పరిమితికి మించి వేడి నీటిని తాగే వారిలో అనారోగ్య సమస్యలలు తలెత్తే అవకాశం ఉంది. వాటి గురించి తెలుసుకుందాం.
రోజంతా వేడి నీటిని తాగే వారిలో ముఖ్యంగా నాలుకపై రుచి కణాలు కాలిపోతాయి. ఈ లక్షణం ఇతర అనారోగ్యాలకు దారి తీయొచ్చు. వేడి నీటిని అధికంగా తాగే వారిలో నాలుకతో పాటు గొంతుకు కూడా హాని కలుగుతుంది. నాలుక, గొంతు వేడి నీటి వల్ల కాలిపోయే అవకాశం ఉంది. అంతేకాకుండా నోటిలో ఉండే చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. వేడి నీరు అధికంగా తీసుకోవడం వల్ల పెదవి, నోటి పొర కాలిపోయే ప్రమాదం ఉంది. దీంతో పాటు రోజంతా వేడి నీరు తాగే వారిలో అన్నవాహికలోని కణజాలం దెబ్బతింటుంది. నిద్ర సమస్యలు కూడా తలెత్తుతాయి. వేడి నీరు ఎక్కువగా తాగితే రాత్రి వేళ మల విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. ఇది నిద్రాభంగానికి కారణం అవుతుంది. మూత్రపిండాలు పాడవడానికి కారణమవుతుంది. కాబట్టి శీతాకాలంలో పరిమితికి మించి వేడి నీరు తీసుకుంటే నష్టాలు కూడా ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.