పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి 2023-24 సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తుందని అన్నారు. సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని, ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని తెలిపారు. EPFOలో సభ్యుల సంఖ్య రెట్టింపయిందని, డిజిటల్ చెల్లింపులు బాగా పెరిగాయని అన్నారు.