మన నాలుక రంగు వల్ల మనం ఏ అనారోగ్యంతో బాధ పడుతున్నామో తెలుసుకోవచ్చు. శరీరం ఏదైనా అనారోగ్య సమస్య ఎదుర్కొంటుంటే నాలుక మనకు సంకేతాలను అందిస్తుంది. నాలుక రంగు మారితే ఏ వ్యాధి చుట్టుముట్టిందో అర్ధం చేసుకోవచ్చు. మనం ఎదుర్కొనే అనారోగ్య సమస్యలను నాలుక రంగు తెలియజేస్తుంది. నాలుక రంగు మారడం వల్ల కలిగే అనారోగ్యాల గురించి తెలుసుకుందాం.
నాలుక రంగు మనకు ఏ వ్యాధి వచ్చిందో తెలుపుతుంది. నాలుక మృదువుగా ఉంటే, మీ విటమిన్ల లోపం ఉందని అర్థం చేసుకోవచ్చు. విటమిన్ బీ 12, ఐరన్ లోపం ఉంటే నాలుక మృదువుగా అనిపిస్తుంది. దీనిని పప్పైల్ అంటారు. దీంతో శరీరానికి అవసరమైన విటమిన్లు మనకు అందడం లేదని తెలుసుకోవాలి. ఆహారంలో మార్పులు చేసుకుంటే ఈ సమస్య అధిగమించవచ్చు. నాలుకపై ఏర్పడిన గాయం క్రమం తప్పకుండా కనిపిస్తే మీరు ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నారని సంకేతం. పరధ్యానం, ఒత్తిడి, ఆందోళన వల్ల బ్రష్ సరిగ్గా చేయలేం. ఇలాంటి పరిస్థితుల్లో గాయాలు ఏర్పడతాయి. ఇక ఎవరిదైనా నాలుక స్ట్రాబెర్రీ రంగులో మారిపోతే శరీరంలో ఎలర్జీ ఉందని అర్ధం చేసుకోవాలి. గొంతు నొప్పి వంటివి ఉంటే నాలుక అలా కనిపిస్తుంది. దీనికి కారణమైన బ్యాక్టీరియా ఎరుపు విషాన్ని నాలుకపై వదిలివేసినప్పుడు ఇలా నాలుక ఎర్రగా కనిపిస్తుంది.