పులివెందుల నడిబొడ్డులో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు మంగళవారం ఉదయం శ్రీవారి సింహ వాహనంపై దర్శనమిచ్చారు. సాయంత్రం 6 గంటలకు ఊంజల్ సేవ నిర్వహించి విశేషణ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంచిపెట్టారు. అనంతరం సతీసమేతుడైన స్వామి వారు ముత్యపు పందిరి వాహనంలో పురవీధులలో జయ జయ ద్వానాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారు ఊరేగుతుంటే భక్తులు అడుగడుగునా నీరాజనాలు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు.