మోపిదేవి మండలంలోని పలు గ్రామాలలో అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు బుధవారం ఉదయం స్వయంగా పింఛన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారులతో మాట్లాడి వారి యోగక్షమాలను తెలుసుకున్నారు. మండలంలో కోటి 59 లక్షల రూపాయలను 6059 మంది లబ్ధిదారులకు పింఛన్లు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. పింఛన్ల పంపిణీలో నియోజకవర్గ మొదటి స్థానంలో ఉన్నట్లు తెలిపారు. వీరి వెంట సర్పంచులు వాలంటీర్లు ఉన్నారు.