2023-24 సంవత్సరానికి కేంద్రం బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. పర్యావరణ చర్యల్లో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి పెద్దపీట వేస్తున్నట్టు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనాలపై కస్టమ్స్ సుంకం తగ్గిస్తున్నట్టు తెలిపారు. టీవీ ప్యానెళ్లపైనా సుంకం తగ్గించారు. దీంతో ఎలక్ట్రిక్ వాహనాలు, టీవీలు, మొబైల్ ఫోన్లు, కిచెన్ చిమ్నీలు, లిథియం అయాన్ బ్యాటరీల ధరలు తగ్గనున్నాయి.