శీతాకాలం రాగానే చర్మం పాలిపోతుంది. శరీరంలో తేమ శాతం తగ్గగానే చర్మం కళావిహీనంగా మారుతుంది. సరైన జాగ్రత్తలు పాటించకపోతే పొలుసు బారిన చర్మం ఏర్పడుతుంది. చర్మం పొడిగా మారిపోయి, దురద పుడుతుంది. చర్మ వ్యాధులు తలెత్తుతాయి. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నిగారింపుతో కూడిన మృదువైన చర్మాన్ని పొందొచ్చు.
గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. స్నానం చేసే సమయం పరిమిత సమయం ఉండాలి. చర్మాన్ని సున్నితంగా ఉంచుకోవాలి. చర్మంపై మృదుత్వాన్ని పోగొట్టే సబ్బులు, తేలికపాటి ఫోమింగ్ క్లెన్సర్‌లను ఉపయోగించవద్దు. లాక్టిక్ యాసిడ్, సాలిసిలిక్ యాసిడ్ కలిగిన కెరాటోలిటిక్ క్రీమ్ ఉపయోగించండి. చర్మాన్ని మృదువుగా మార్చడానికి నాణ్యమైన మాయిశ్చరైజర్‌లను ఎంపిక చేసుకోవాలి. నిత్యం వర్కవుట్‌లు చేసే వారు వస్త్రధారణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
సింథటిక్ దుస్తులను ఉపయోగించకపోవడం మంచిది. స్నానం చేసేటప్పుడు స్క్రబ్బింగ్ ఉపయోగించడం మానుకోండి. షేవింగ్ లేదా వ్యాక్సింగ్ సరైన పద్ధతిలో చేసుకోకుంటే సమస్య తీవ్రం అవుతుంది. చర్మం హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకోండి. పొడిబారుతున్న వేళ మాయిశ్చరైజింగ్‌ను ఉపయోగించండి.