ప్రస్తుత కాలంలో పెద్ద సంఖ్యలో దంపతులు సంతానోత్పత్తి సమస్యను ఎదుర్కొంటున్నారు. హార్మోన్లు అసమతుల్యత, ఇతరత్రా అనారోగ్య సమస్యల వల్ల ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. మనం తీసుకునే ఆహారం కూడా సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుంది. కొన్ని ఆహార పదార్థాలు మహిళలు, పురుషులలో సంతానోత్పత్తి పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.
గుడ్లు, ఆకుపచ్చని కూరగాయలు, డ్రైఫ్రూట్స్, బ్రొకోలీ, టొమాటోలు, అవ్‌కాడోలు, గుమ్మడి గింజలు నిత్యం ఆహారంలో చేర్చుకోవాలి. పండ్లు, తాజా కూరగాయల్లో ఫోలిక్ యాసిడ్, విటమిన్-సి ఉంటాయి. అండం ఆరోగ్యంతో పాటు గర్భస్రావం ముప్పును తగ్గిస్తాయి. బచ్చలికూర, బ్రకోలీ, మెంతులు వంటివి పురుషులలో వీర్య నాణ్యతను పెంచుతాయి. క్రోమోజోమ్ నష్టాన్ని తగ్గించి, సంతానోత్పత్తిని పెంచేందుకు వాల్‌నట్స్, ఇతర డ్రైఫ్రూట్లలో ఉండే సెలీనియం దోహదపడుతుంది. టొమాటోలలో ఉండే లైకోపీన్, పురుషుల స్పెర్మ్ కౌంట్‌ను 70 శాతం వరకు పెంచుతుంది. గుమ్మడి గింజలలోని జింక్ స్త్రీ, పురుషులలో సంతానోత్పత్తి సమస్యలను దూరం చేస్తుంది. డీఎన్ఏ సమస్యలను తగ్గించి గర్భధారణకు సాయపడుతుంది.