బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పొరపాటుతో లోక్సభలో నవ్వులు పూశాయి. వెహికిల్ స్క్రాపింగ్ పాలసీ గురించి ఆమె ప్రకటన చేసిన సమయంలో ఇంగ్లీష్ పదాన్ని తప్పుగా పలికారు. పాత కలుషిత వాహనాలను రిప్లేస్ చేస్తున్నామని చెప్పే సమయంలో ఓల్డ్ పొలిటికల్ అని పలికారు. ఆ తర్వాత వెంటనే సారీ చెబుతూ.. ఓల్డ్ పొల్యూటింగ్ వెహికిల్స్ అని తెలిపారు. అయితే పొల్యూటింగ్ పదం బదులు పొలిటికల్ అని మంత్రి పలకడంతో విపక్ష సభ్యులు నవ్వేశారు. ఆమె తన పొరపాటును గుర్తించి చిరునవ్వు నవ్వారు.