నారా లోకేశ్ యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్రతో వైసీపీ నాయకులు, సీఎం జగన్ వెన్నులో వణుకు మొదలైందని మంత్రాలయం టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి తిక్కారెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం రచ్చుమర్రి గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ... నారా లోకేశ్ పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నదన్నారు. మంత్రాలయం నియోజకవర్గం నుంచి వేలాది మంది బతుకు తెరువు కోసం వలసలు వెళుతోంటే . రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పత్తి, మిరప, వేరుశనగ పంటల్లో తీవ్ర నష్టం వాటిల్లి రైతులు హైదరాబాదు, ముంబై, గుంటూరు తదితర ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు జెట్టి నరసింహులు, జెట్టి వీరేష్, శ్రీనివాసులు, రామయ్య, నాగన్న, చిదానంద, వగరూరు రామిరెడ్డి, అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు.