టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర 6వ రోజు బుధవారం ఉదయం చిత్తూరు జిల్లా, కమ్మనపల్లె నుంచి ప్రారంభించారు. ఈ సందర్బంగా కొలమసానిపల్లె దగ్గర మహిళలతో లోకేష్ భేటీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ప్రజల్లో వైసీపీ పాలనపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. సైకో పాలనకు రోజులు దగ్గరపడ్డాయన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక అన్ని సమస్యలను తీరుస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. కాగా ఈ సాయంత్రం 5:45 గంటలకు గొల్లపల్లి దగ్గర ఎస్సీ ప్రముఖులతో భేటీ కానున్నారు. రాత్రికి రామాపురం ఎమ్మోస్ హాస్పటల్ దగ్గర లోకేష్ బస చేస్తారు. అంతకుముందు లోకేష్ పలమనేరు నియోజకవర్గం, బైరెడ్డిపల్లె మండలం, బేలుపల్లెలో వాల్మీకి సామాజిక వర్గం ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం వల్ల ఎలాంటి ఇబ్బందు పడుతోంది వారు లోకేష్‌కు వివరించారు. వాల్మీకిలను సీఎం జగన్ నమ్మించి మోసం చేశారన్నారు. ఎస్టీల్లో చేర్చే అంశంపై అసలు స్పందించడం లేదన్నారు. ‘‘రుణాలు లేవు, ఉద్యోగాలు లేవు. గ్రామాల్లో వాల్మీకి యువత కర్ణాటక, తమిళనాడు వెళ్లి బ్రతుకుతున్నాం’’ అంటూ వాల్మీకి సోదరులు ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలపై స్పందించిన లోకేష్.. టీటీపీ అధికారంలోకి రాగానే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.