ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా ఆహ్వానం అందింది. ఈ ఏడాది వేసవిలో అమెరికాలో పర్యటించాల్సిందిగా ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఆహ్వానం పంపినట్లు, దీనికి మోదీ సైతం అంగీకరించినట్లు తెలుస్తోంది. జూన్ లేదా జూలైలో మోదీ యూఎస్ వెళ్తారని, అక్కడ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారని సమాచారం. అనంతరం వైట్ హౌస్ నిర్వహించే విందులో పాల్గొంటారు.