ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హంతకులను కాపాడటంలో ఉన్న శ్రద్ద జగన్ కి రాష్ట్ర ప్రజలపై లేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 01, 2023, 03:28 PM

ఏపీ సీఎం జగన్ రెడ్డి కి బాబాయ్  హంతకులను కాపాడటంలో ఉన్న శ్రద్ద రాష్ట్ర ప్రజలపై లేదని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర  అన్నారు. అయన మీడియాతో మాట్లాడుతూ... బాబాయ్ హంతకులను కాపాడేందుకు... విశాఖ రాజధాని అంటూ... సుప్రీం కోర్టు లో ఉన్న విషయాన్ని తెరమీదకు తెచ్చి డైవర్ట్ పాలిటిక్స్‌ కు తెరలేపారని మండిపడ్డారు. లిక్కర్ స్కాం లో భార్య పేరు బయటకు రాగానే ఎన్టీఆర్ యూనివర్సిటీ  పేరు తెరపైకి తీసుకువచ్చి ఆ విషయాన్ని కూడా డైవర్ట్ చేశారన్నారు. ‘‘నాడు రాజధానికి ౩౦ వేలు ఎకరాలు కావాలన్నావు, ఇల్లు ఇక్కడే కట్టాను అన్నావు, ఇప్పుడు రాజధాని విశాఖ  అంటున్నావు ఇది మోసం కాదా జగన్ రెడ్డి’’ అని ఆయన ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com