‘‘యువగళం’’ పాదయాత్ర భాగంగా చిత్తూరు జిల్లా, పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లె మండలం బేలుపల్లెలో వాల్మీకి సామాజిక వర్గం ప్రతినిధులతో టీడీపీ నేత నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం వల్ల తాము ఎలాంటి ఇబ్బందు పడుతున్నామో లోకేష్ కు వాల్మీకి సోదరులు వివరించారు. వాల్మీకిలను జగన్ నమ్మించి మోసం చేశారన్నారు. ఎస్టీల్లో చేర్చే అంశంపై అసలు స్పందించడం లేదని తెలిపారు. ‘‘రుణాలు లేవు, ఉద్యోగాలు లేవు. గ్రామాల్లో వాల్మీకి యువత కర్ణాటక, తమిళనాడు వెళ్లి బ్రతుకుతున్నాం’’ అంటూ వాల్మీకి సోదరులు ఆవేదన చెందారు.