ఈరోజు మూడో టి20లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో టీమిండియా, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈమ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని జట్టు రెండో టీ20లో పునరాగమనం చేసిన తర్వాత పటిష్ట ప్రదర్శనను కనబరుస్తుంది. టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 36 బంతుల్లో 7 ఫోర్లతో హాఫ్ సెంచరీ సాధించాడు. మరో బ్యాట్స్‌మెన్ రాహుల్ త్రిపాఠి (44) కూడా ధనాదన్ బ్యాటింగ్‌తో అలరించాడు.