కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం విమర్శలు గుప్పించారు. ప్రజల ఆందోళనలు, ఆకాంక్షలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడా నిరుద్యోగం, పేదరికం, అసమానతలు కనిపించలేదని అన్నారు. కేంద్రం ఎవరిపై మక్కువ చూపుతోందో, ఎవరికి పట్టింపు లేదని ఈ బడ్జెట్ మరోసారి స్పష్టం చేసిందన్నారు.పన్ను మినహాయింపు కూడా సరిపోదని చిదంబరం అన్నారు. పరోక్ష పన్నులను కూడా తగ్గించలేదని విమర్శించారు.