తూర్పు గోదావరి జిల్లా, నల్లజర్ల మండలం దూచబర్ల కేబుల్ టీవీ యాజమాని ప్రసాద్ ఎటువంటి అనుమతులు లేకుండా ఆహా ఓటీటీ యాప్ నుంచి కొత్త సినిమాలను సామాజిక మాద్యమం ద్వారా దొంగిలించి కేబుల్ టీవీలో ప్రసారం చేస్తున్నట్లు సమాచారం రావడంతో హైదారాబాద్‌కి చెందిన ఆహ సంస్థ ప్రతినిధి చలపతిరాజు బుధవారం నల్లజర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ నరసింహమూర్తి ఆధ్వర్యంలో దూబచర్ల ఎన్టీఆర్ కాంప్లెక్స్‌లో నడుపుతున్న కేబుల్ టీవీ కార్యాలయాన్ని సోదాచేసి కంప్యూటర్లు ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకుని పైరవీకి పాల్పడిన ప్రసాద్‌పై కేసునమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ నరసింహమూర్తి తెలిపారు.