విజయవాడ నగరంలోని ఏలూరు రోడ్డులో చల్లపల్లి బంగ్లా వద్ద బ్రేక్ ఫెయిలైన తెలంగాణ సత్తుపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఓ హోటల్ గేటును ఢీకొంది. దీంతో ఇద్దరు ప్రయాణికులకు, హోటల్లో పనిచేసే మరో వ్యక్తికి గాయాలయ్యాయి. సత్తుపల్లి నుంచి విజయవాడకు వస్తుండగా చల్లపల్లి బంగ్లా వద్ద బస్సు బ్రేక్ ఫెయిలవడంతో డ్రైవర్ సీహెచ్ మురళీమోహన్ అదుపు చేయలేకపోయాడు. మలుపు తిప్పుతూ ఎదురుగా ఉన్న గేట్‌ను ఢీకొట్టాడు. గాయపడిన వారిని చికిత్స నిమి త్తం ఆస్పత్రికి తరలించారు. గవర్నరుపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.