బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం గ్రామంలో క్షుద్రపూజలు, చేతబడులు చేస్తున్నాడనే అనుమానం తో ఓ యువకుడిని గురువారం గ్రామస్థులు నిర్బంధించి చెట్టుకు కట్టి వేసిన ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అయితే మీడియాని గ్రామంలోకి రాకుండా గ్రామస్థులు అడ్డుకోవడమే కాకుండా ఫోటోలు తీసిన ఓ దినపత్రిక విలేఖరి సెల్ ఫోన్ ను పగలగొట్టారు. పరిస్థితి ఉద్రిక్తకరంగా ఉండగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.