ప్రకాశం జిల్లా అవతరణ దినోత్సవ పురస్కరించుకొని మార్కాపురం మండల అభివృద్ధి కార్యాలయంలో ఎంపీడీవో తోట చందన ఆధ్వర్యంలో టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి గురువారం నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మన భారతదేశానికి స్వాతంత్రం రావడంలో టంగుటూరి ప్రకాశం పంతులు కీలక పాత్ర వహించాడని గుర్తు చేశారు. దానికి అనుగుణంగా మనం కూడా ఏ విషయమైనా సరే టంగుటూరి ప్రకాశం పంతులు గారిని ఆదర్శంగా తీర్చుకొని సమాజంలో ధైర్యంగా ముందుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, పరిపాలన అధికారి సరోజినీ దేవి, టైపిస్ట్ కె. వి రమణారెడ్డి, పిఓపిఆర్డి, రామ్మోహన్ రెడ్డి, వెంకటేశ్వరమ్మ, వంశీ, భవాని, శారద, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.