గ్రామంలో నెలకొన్న సమస్యలన్నింటిని పరిష్కరించడానికి కృషి చేస్తానని జమ్మలమడుగు ఎమ్మెల్యే డాక్టర్ మూలె సుధీర్ రెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం ముద్దనూరు మండలంలోని కోసినే పల్లె గ్రామంలో ఆయన గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ముని రాజారెడ్డి తో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. గ్రామస్తులు గ్రామములో సిసి రోడ్లు, డ్రైనేజ్ సౌకర్యం కల్పించాలని ఆయన దృష్టికి తేవడంతో స్పందించిన ఆయన మీ సమస్యలన్నింటిని పరిష్కరిస్తామన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదల ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో అర్హులైన వారందరికీ నిష్పక్షపాతంగా పథకాలు అందుతున్నాయని ఆయన తెలిపారు.