గడచిన కాలంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఎర్రగొండపాలెంలో రక్తదాన శిబిరాన్ని పలుమార్లు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా కొంతమంది సేవ దృక్పథం ఉన్న వ్యక్తులను రెడ్ క్రాస్ సొసైటీ నేతృత్వంలో పలువురిని గుర్తించారు. ప్రకాశం జిల్లా అవతరణ దినోత్సవం సందర్భంగా గురువారం రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా ఎర్రగొండపాలెంకి ప్రశంస పత్రాలు పలువురికి పంపించారు. వారిలో ఒకరైన ఎర్రగొండపాలెంకు చెందిన గోరంట్ల కనకరావుకు మండల విద్యశాఖ అధికారి ఆంజనేయులు ఆయనకు ప్రశంస పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పలువురు కనకారావును అభినందించారు.