క్వీన్ ఎలిజబెత్ 2 ఫోటోని తమ కరెన్సీ నోటు నుండి తొలగించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించింది. 5 డాలర్ల నోటు నుండి క్వీన్ ఫోటోను తొలగించి, దేశ సంస్కృతి, చరిత్ర ప్రతిబంబించేలా కొత్త డిజైన్ ను రూపొందిస్తామని ఆస్ట్రేలియా సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. ప్రస్తుతం 5 డాలర్ల నోటుకు ఒక వైపు క్వీన్ ఎలిజబెత్ 2 ఫోటో ఉండగా, మరోవైపు ఆస్ట్రేలియా పార్లమెంటు భవనం ఫోటో ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa