పశ్చిమ రాయలసీమ పట్టభద్రల ఎమ్మెల్సీ ఎన్నికలలో వైఎస్ఆర్సిపి తరఫున పోటీ చేస్తున్న నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్సీ అభ్యర్థి రవీంద్రా రెడ్డి కోరారు. బుధవారం పులివెందుల మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలు, బాలికల జూనియర్ కళాశాల , డిగ్రీ కళాశాల, పలు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు , బ్యాంక్ లలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రవీంద్రారెడ్డి వైయస్సార్ టిఎఫ్ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ టీఎఫ్ నాయకులు వెంకట్ నాథ్ రెడ్డి, ఆకుల సుభాష్ తదితరులు పాల్గొన్నారు.