విశాఖపట్టణాన్ని రాజధాని చేస్తే రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరుగుతుందని. అదే అమరావతి రాజధాని అయితే ఒక టిడిపికి నాయకులకు మేలు జరుగుతుందని పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ గురువారం పులివెందులలో నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్టణాన్ని రాజధాని చేయడం ఎంతో శుభ పరిణామన్నారు. విశాఖను రాజధాని చేయడంతో ఎన్నో పరిశ్రమలు వస్తాయన్నారు. దీంతో నిరుద్యోగ సమస్య ఉండదన్నారు. ఏపీలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశ్యమన్నారు.