బ్లాక్ టీ తాగితే అధిక బరువు సమస్యకు చెక్ పెట్టవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. అధిక బరువు కారణంగా వచ్చే మధుమేహం, గుండె జబ్బుల, పీసీఓడీ వంటి సమస్యలు బ్లాక్ టీ తాగితే పోయే అవకాశం ఉంది. బ్లాక్ టీ తాగితే జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. క్యాన్సర్ కణతులు పెరగకుండా ఉంటాయి. బ్లాక్ టీలో ఉండే కేంప్ ఫెరాల్ అనే యాంటీఆక్సిడెంట్ రొమ్ము క్యాన్సర్ ని అడ్డుకునేందుకు సహాయపడుతుంది. బ్లాక్ టీ తాగితే మధుమేహం, రక్తపోటు నియంత్రలో ఉంటాయి. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. బ్లాక్ టీని రోజూ తీసుకోవడం వల్ల ఒత్తిడి అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.