కేంద్రం ఎప్పటి మాదిరిగానే 2023-24 బడ్జెట్‌లోనూ ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసిందని ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య జిల్లా అధ్యక్షులు బుక్కే విశ్వనాథ నాయక్ గురువారం రాయచోటిలో ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల హక్కు అయిన ప్రత్యేకహోదా కు మొండిచెయ్యి చూపిందని, విభజన హామీలను పూర్తిగా అటకెక్కించిందని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాధ్యత తనది అని మొసలి కన్నీరు కార్చిన ప్రధాని గత ఎనిమిది సంవత్సరాలుగా ద్రోహం చేస్తూనే వచ్చారని రాష్ట్ర అభివృద్ధిని అంబానీ అదానిల కి బిజెపి తాకట్టు పెట్టడం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ వంటి వాటి ఊసెత్తలేదు. ప్రభుత్వ రంగంలో ఉన్న విశాఖ ఉక్కును బలపర్చుకోడానికి ఎలాంటి ప్రతిపాదన లేదు. ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లా వంటి వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఎలాంటి నిధులు కేటాయించలేదు అని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల సంగతీ అలాగే ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల గిరిజన విశ్వవిద్యాలయాలకు 2022-23 సంవత్సరం బడ్జెట్‌కన్నా 15 శాతం కోత విధించడం అమానుషం అని బడ్జెట్లో ఎస్సీ ఎస్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మొత్తం 62 పేజీల బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి ఆంధ్రప్రదేశ్ అన్నమాటను ఉచ్ఛరించకపోవడం దారుణంఅన్నారు.