అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలు అదానీ గ్రూప్ పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇవాళ అదానీ స్టాక్ విక్రయాలు అధికం కావడంతో కొన్ని అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు లోయర్ సర్క్యూట్ లకు పడిపోయాయి. ఈ ప్రకంపనలు నేపథ్యంలో గత వారం నుంచి అదానీ గ్రూప్ మార్కెట్ విలువలో దాదాపు రూ.7.44 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది.