పోషకాహార లేమితో, విటమిన్ డీ లోపంతో బాధపడే వారు రోజుకు ఓ గుడ్డు తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గుడ్డును తినడం వల్ల కంటి సమస్యలు పోతాయి. గుడ్డులో ఉండే క్యాల్షియం జుట్టు, చర్మం, గోర్లు లాంటివి ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తుంది. గుడ్డు తింటే కాలేయ జబ్బు, ధమనులు గట్టి పడటం, నాడీ సమస్యలు రాకుండా ఉంటాయి. గుడ్డుతో గుండెకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు.