కాలేజీ రోజుల్లో తన ప్రేమకు నో చెప్పిందని నాలుగేళ్ల తర్వాత ఓ వ్యక్తి మహిళపై దాడి చేసిన ఘటన గుజరాత్ అహ్మదాబాద్ లో జరిగింది. చంద్ ఖేడాకు చెందిన మహిళను మంగళవారం కలిసేందుకు వచ్చిన ఆమె బ్యాచ్ మేట్ సర్వేష్ రావల్ కత్తితో పలుమార్లు దాడికి పాల్పడ్డాడు. తన భర్త బయటకు వెళ్లగా దాడి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతుండగా, నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.