అన్నితెలిసి తన అక్కకొడుకునే ప్రేమించింది 60 ఏళ్ల మహిళ. పిన్ని అనే సంగతి మరిచిపోయి అతడిని దక్కించుకునేందుకు నకిలీ వివాహ సర్టిఫికేట్‌ను సృష్టించింది. అతడి పెళ్లికి 5 రోజుల ముందు అతనితో తనకు పెళ్లి జరిగిందంటూ తప్పుడు పెళ్లి సర్టిఫీకేట్ ను ఆడపెళ్లివారికి పంపింది. దీంతో జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. ఆమె ప్రవర్తనకు విసుగుచెందిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ షాకింగ్ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో వెలుగుచూసింది.