మహారాష్ట్రలో కొంతమంది దుండగులు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ పేరుతో 100 మందికి టోకరా వేసి సుమారు రూ.5 కోట్ల మేర మోసానికి పాల్పడ్డారు. నాసా ‘రైస్ పుల్లర్’ యంత్రాంగంపై పెట్టుబడులు పెడితే లాభాలొస్తాయని బాధితులకు తెలిపారు. శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధన చేస్తున్నారంటూ నమ్మబలికారు. చివరకు ఓ వ్యక్తి అనుమానంతో పోలీసులను ఆశ్రయించగా అసలు విషయం తెలిసింది. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.