తమిళనాడు క్రిష్టగిరి జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గోబాచంద్రలో జల్లికట్టు నిర్వహణకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని యువకులు వీరంగం సృష్టించారు. బెంగళూరు-చెన్నై జాతీయ రహదారిపై నిరసనకు దిగన యువకులు పోలీసులపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. దాడిలో ఓ మహిళా ఎస్సైకి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఆరు ప్రభుత్వ బస్సులు, మూడు పోలీసు వాహనాలను స్థానికులు, యువకులు ధ్వంసం చేసినట్లు సమాచారం.